Gropu2: AP గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన: పరీక్ష వాయిదా కోరుతూ నిరసన 1 y ago
AP గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు. గ్రూప్-2 మెయిన్స్ రోస్టర్‌లో ఉన్న లోపాలను సరిచేయాలని, పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. నిన్న ఇదే అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా, పరీక్ష వాయిదాకు న్యాయస్థానం మొగ్గుచూపలేదు. ఎల్లుండి జరగనున్న పరీక్షపై అభ్యర్థులు ఇంకా స్పష్టత కోరుతున్నారు.